-->

🔱CM రేవంత్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న లష్కర్ బోనాల ఉత్సవం

🔱CM రేవంత్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న లష్కర్ బోనాల ఉత్సవం


హైదరాబాద్, లష్కర్ బోనాల ఉత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్‌లోని ప్రముఖ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సీఎం గారిని ఆహ్వానించి పట్టు వస్త్రాలతో మహంకాళి అమ్మవారిని ఆలంకరించగా, ఆయన అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర ప్రజల క్షేమం, శాంతి, సుభిక్షం కోసం ప్రార్థించారు. "తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి అనుగ్రహం నిరంతరం ఉండాలి" అంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ ప్రత్యేక దర్శన కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

Blogger ఆధారితం.