-->

మొహర్రం పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం

మొహర్రం పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం


మొహర్రం శాంతి, సహనం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రవక్త ముహమ్మద్ మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చూపిన త్యాగమే ఈ పవిత్ర దినానికి ప్రేరణ అని సీఎం తెలిపారు. ఆయన స్వార్థం లేకుండా ధర్మం కోసం పోరాడిన విధానం న్యాయం, ధర్మం, మానవత్వం విలువలను నేటికీ గుర్తు చేస్తుందన్నారు. మొహర్రం ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా, సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు.

ఈ పర్వదినం హిందూ - ముస్లిం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మారిందని, ఇది తెలంగాణలోని మతసామరస్యానికి అద్దంపడే విధంగా ఉందన్నారు. ఇమామ్ హుస్సేన్ త్యాగం మనకందరికీ మార్గదర్శిగా నిలవాలన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలనే ఆశయంతో ఈ రోజు ప్రతి ఒక్కరికీ శాంతి, ఐక్యత లభించాలని సీఎం ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.