-->

జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ దంపతులు పోలీసుల ఎదుట లొంగింపు

జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ దంపతులు పోలీసుల ఎదుట లొంగింపు


జనంలోకి మావోయిస్టు నేతలు: 

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం ఆస్తమించుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ కగార్" ఫలితంగా మావోయిస్టు నేతలు ఒక్కొక్కరిగా ఆయుధాలు విడిచి ప్రజా జీవనంలోకి అడుగుపెడుతున్నారు. తాజగా ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు రాచకొండ పోలీసులకు లొంగిపోయారు.

ఈ ఇద్దరు నేతలు జననాట్య మండలి వ్యవస్థాపకుడు సంజీవ్ మరియు ఆయన భార్య దీనా. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దండకారణ్య ప్రాంతాల్లో మావోయిస్టు చారిత్రక ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రత్యేకంగా సంజీవ్ గారు, ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్‌తో కలిసి జననాట్య మండలిని స్థాపించి, ఆయుధపరంగా కాకుండా కళా రూపంలో విప్లవాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన అనంతరం దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వీరిద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

ఇది సడెన్‌గా జరిగిన పరిణామం కాదు. రెండు రోజుల క్రితం కూడా మరొకరిద్దరు మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న మరియు చౌదరి అంకు భాయి రామగుండం పోలీసులకు లొంగిపోయారు. వారం రోజుల్లో నాలుగు కీలక నేతలు లొంగిపోవడం మావోయిస్టు పటనానికి నిదర్శనంగా పరిగణించబడుతోంది.

ఆపరేషన్ కగార్ ప్రభావం: మావోయిస్టు వర్గాల్లో భయాందోళన

2024 జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ద్వారా కేంద్రం మావోయిస్టులపై ఉక్కుపాదం మోస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 85 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు, వందల సంఖ్యలో లొంగిపోయారు. వేల సంఖ్యలో జవాన్లు ఇందులో పాల్గొంటుండగా, మావోయిస్టుల నివాస స్థావరాలు ధ్వంసం చేయడం, ఆర్థిక వనరులను కట్ చేయడం వంటి చర్యల ద్వారా వారిని అన్ని విధాలుగా మట్టికరిపిస్తున్నారు.

ఈ క్రమంలో మావోయిస్టు నేతలు ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో కుంగిపోతూ... జీవించాలంటే లొంగిపోవడమే మార్గమని అంగీకరిస్తున్నారు. ఉద్యమ బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది..

Blogger ఆధారితం.