-->

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు వినతి

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు వినతి


హైదరాబాద్‌: ఏజెన్సీ ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్న ఎస్సీ కులాలకు స్థానిక రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాదులో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారిని కలుసుకుని వినతిపత్రాన్ని సమర్పించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు కల్పించిన స్థానిక రిజర్వేషన్లు (జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయిలో) గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రద్దు చేసి జనరల్ కేటగిరీలో కలపడంతో తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. దీని వల్ల ఆ ప్రాంత ఎస్సీ సమాజం రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయిందన్నారు.

రేపు జరగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించి, 2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ ఎస్సీ కులాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆ హామీని అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర నాయకులు రజిని అంబేడ్కర్, లీగల్ అడ్వైజర్ మల్లన్న, నండ్రు నరసింహారావు, మైసయ్య, కె. శంకర్రావు, బలవంతపు సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.