పెళ్లైన నాలుగు నెలలకే దంపతుల ఆత్మహత్య: ఆర్థిక ఒడిదుడుకుల మధ్య విషాదాంతం
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాక ప్రాంతంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీనగర్‌కు చెందిన దంపతులు నాలుగు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్న పవన్ కుమావత్, ఆసియా హసింఖాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, వీరు ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలిసింది. అదే కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఇద్దరూ ఉరివేసుకుని జీవితానికి ముగింపు పలికారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు అంబర్‌పేట పోలీసులు తెలిపారు. యువ దంపతుల ఆత్మహత్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Post a Comment