అక్రమ ఆస్తుల కేసులో మాజీ నీటిపారుదల ఇంజనీర్ అరెస్టు
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ అక్రమ ఆస్తుల కేసును ముడిపెట్టారు. నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన సి. మురళీధర్ రావుపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారు.
అనిశా అధికారులు మురళీధర్ నివాసంతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన 11 ఇతర ప్రదేశాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఈ దాడులలో అనేక స్థిర మరియు చరాస్తులు వెలుగుచూశాయి.
సోదాల్లో బయటపడిన ఆస్తులు:
- హైదరాబాద్‌లో విల్లా
- నాలుగు ఫ్లాట్లు
- నాలుగు ఓపెన్ ప్లాట్లు
- ఒక వాణిజ్య భవనం
- 6500 చదరపు గజాల ఓపెన్ ల్యాండ్
- వ్యవసాయ భూమి – 11 ఎకరాలు
- జహీరాబాద్‌లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్
- కరీంనగర్‌లో ఒక వాణిజ్య భవనం
- కోదాడలో బహుళ అంతస్తుల భవనం
- వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్
- బెంజ్ కారుతో సహా మూడు చతుర్చక్ర వాహనాలు
- బంగారు ఆభరణాలు
- బ్యాంకు ఖాతాల్లో ఉన్న భారీ నగదు నిల్వలు
ఈ మొత్తం ఆస్తుల విలువ కొద్దిపాటి జీతంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగి శక్తికి మించి ఉన్నదని అనిశా అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి కేసు దర్యాప్తులో ఉంది.
ప్రజలకు అనిశా విజ్ఞప్తి: ఏ ప్రభుత్వాధికారి లంచం అడిగినట్లయితే, అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అలాగే ఫిర్యాదులను వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ - ట్విట్టర్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా చేయవచ్చు.
గమనిక: ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు హామీ ఇచ్చారు.
Post a Comment