-->

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి కవితకు ఉద్వాసన!

 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి కవితకు ఉద్వాసన!


హైదరాబాద్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంతవరకు సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పదవి నుండి ఉద్వాసన పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈరోజు జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా, టీజీబీకేఎస్ ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. కార్మిక సంఘం పూర్తిగా బీఆర్ఎస్‌కు అనుబంధంగా పనిచేయాలంటూ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు కవిత ఈ సంఘంలో గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నా, తాజా మార్పులతో ఆమె పాత్ర పూర్తిగా తొలగించబడినట్లయింది. ఇందుకు సంబంధించి కారణాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, రాజకీయ మార్పులు, నాయకత్వ పునర్వ్యవస్థపై వర్గీయ అసంతృప్తి కారణమై ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాలు టీజీబీకేఎస్‌లో కొత్త శకానికి నాంది పలుకుతాయా? లేక అంతర్గత విభేదాలకు దారితీస్తాయా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

Blogger ఆధారితం.