బ్రేకింగ్ న్యూస్: ORR పై ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు అక్కడికక్కడే మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాలు బలిగొంది. వేగంగా వెళ్తున్న కారు వెనక నుంచి లారీని ఢీకొట్టిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ వద్ద చోటు చేసుకుంది. TS07 HW 5858 నంబర్ గల బెలినో కారు, పెద్ద అంబర్‌పేట్ నుండి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా, వేగం అదుపు తప్పి ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
ప్రమాదం ఉదయం 3 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలు కారులో ఇరుక్కుపోయిన తరవాత, పోలీసులు సుమారు మూడు గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు.
మృతుల వివరాలు ఇలా ఉన్నాయి:
- మలోత్ చందు లాల్ (29)
- గగులోత్ జనార్దన్ (50)
- కావలి బాలరాజు (40)(ఇంకొక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది)
తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post a Comment