కమలాపురంలో 10,000 మెట్రిక్ టన్నుల గిడ్డంగి నిర్మాణానికి శంకుస్థాపన
ముదిగొండ, మధిర నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో నిర్మించనున్న 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌కు శనివారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు పాల్గొన్నారు.
రైతుల పంట నిల్వ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ గిడ్డంగి నిర్మాణం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ గిడ్డంగుల నిర్మాణం ద్వారా రైతులకు మద్దతుగా నిలబడతామని అన్నారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, "రైతుల భద్రత, ఆర్థిక లాభాల కోసం గిడ్డంగులు కీలకం. మార్కెట్ ధరల తేడాల వల్ల రైతులు నష్టపోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Post a Comment