వ్యభిచార గృహంపై పోలీసుల దాడి ఇద్దరు మహిళలు ఆరెస్ట్ చేసిన పోలీసులు
విజయనగరం నగరంలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పూల్‌బాగ్ కాలనీ సమీపంలో ఒక ఇంటిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాన్ని పోలీసులు శనివారం బయటపెట్టారు. ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు టూ టౌన్ సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో మహిళా కానిస్టేబుల్ సదరు ఇంటిపై ఆకస్మిక దాడి చేశారు.
ఈ దాడిలో ఇద్దరు మహిళలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.
ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో జరుగుతున్న వ్యభిచార గృహాలపై ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, అందులో భాగంగా ఈ దాడి నిర్వహించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
Post a Comment