వివాహేతర సంబంధం... గ్రామస్థుల చేతిలో దేహశుద్ధి
నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, వివాహేతర సంబంధం కొనసాగించిన ఓ జంటను స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన మండలంలోని మొలకచర్ల గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ స్థానిక నాయకుని తండాకు చెందిన రమేష్‌తో కొన్ని రోజులుగా అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా, ఈ వ్యవహారంపై ఇరు కుటుంబాల పెద్దలు పలుమార్లు హెచ్చరించినా, వారి ప్రవర్తనలో మార్పు రాలేదని సమాచారం.
శనివారం ఉదయం ఇద్దరినీ ఒకే చోట కలిసి చూసిన గ్రామస్థులు, వారిని స్టంబానికి కట్టేసి బహిరంగంగా చితకబాదారు. ఈ దృశ్యాలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీయగా, సమాజంలో మానవ హక్కుల క్షీణతపై ప్రశ్నలు లేవుతున్నాయి.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
Post a Comment