జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ జెండా పండుగ ఘనంగా ప్రారంభం
ప్రతి కార్మికుని ఇంటిపై జెండా ఎగురవేస్తాం – గోలుకొండ రత్నం
హైదరాబాద్, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ (JSTUC) ఆధ్వర్యంలో జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్టుగూడలోని జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జెండాను జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఎస్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం, జాతీయ కార్యదర్శి ఆర్.ఎస్.జే. థామస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుగూరు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు మాటూరి కృష్ణమోహన్, గోలుకొండ లక్ష్మీనారాయణ, ఇతర నేతలు పరుశురాం, వెంకట ప్రభు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాసాని శ్రీనివాసరావు గౌడ్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జై స్వరాజ్ పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు. అసంఘటిత కార్మికులు, రైతు కూలీల సమస్యలపై ప్రభుత్వాలు స్పందిస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు.
జెండా పండుగను ప్రతి కార్మికుని ఇంటి ముందూ, ప్రతి పరిశ్రమలోనూ నిర్వహించి కార్మికుల హక్కులు, సంక్షేమం వంటి అంశాలపై చర్చలు జరిపేలా చూస్తామన్నారు జేఎస్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, తెలంగాణలోని ప్రతి పల్లెలో జెండా ఎగురవేయడం జరుగుతుందన్నారు.
Post a Comment