-->

జగిత్యాలలో విచిత్ర ఘటన: ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్న ఇద్దరు పిల్లల తండ్రి

జగిత్యాలలో విచిత్ర ఘటన: ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్న ఇద్దరు పిల్లల తండ్రి


జగిత్యాల జిల్లాలో ఓ విచిత్ర ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు పిల్లల తండ్రి, తన భార్యను వదిలేసి ఓ ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే... జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు 2014లో సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఇటీవలి కాలంలో రాజశేఖర్‌ హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపుతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. ఈ పరిణామాల మధ్య, భార్య లాస్యను వదిలి దీపుతో సహజీవనం ప్రారంభించాడు.

ఈ విషయం తెలిసిన లాస్య, మానసికంగా కుంగిపోతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యను పరామర్శించకుండా రాజశేఖర్‌ తలదాచుకున్నాడు. దీనితో ఆందోళనకు గురైన ఆమె అత్తమామలు అతడి కోసం వెదకగా, ఆయనను తన ఇంట్లో ట్రాన్స్ జెండర్‌ దీపుతో కలిసి ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కుటుంబ సభ్యులు రూమ్‌కు తాళం వేసి, పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రాజశేఖర్‌ మరియు దీపును స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

Blogger ఆధారితం.