-->

ఘోర రోడ్డు ప్రమాదం బస్సును ట్రాలి ఢీ 18 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం బస్సును ట్రాలి ఢీ 18 మంది మృతి


జార్ఖండ్‌లోని డియోఘర్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు, గ్యాస్ సిలిండర్లను మోస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘటన మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి ప్రాంతంలో ఉదయం 4:30 గంటల సమయంలో సంభవించింది. కన్వర్ యాత్రకు వెళ్తున్న బస్సు గ్యాస్ ట్రక్కును ఎదురుగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతులంతా యాత్రికులుగా గుర్తించబడ్డారు.

గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని మోహన్‌పూర్ సిహెచ్‌సికి (సామూహిక ఆరోగ్య కేంద్రం) తరలించగా, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ఘటనపై సమాచారం అందుకున్న మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ప్రియరంజన్ కుమార్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంపై డియోఘర్ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వాన్ని తక్షణ నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది. బాధితుల పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.