అనుమతిలేకుండా పేలుడు పదార్థాలతో రాళ్లు పగలగొట్టిన ముగ్గురిపై కేసు
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి గ్రామ పరిధిలో గౌలిగుడెం ప్రాంతంలో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలతో రాళ్లు పగలగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రా రెడ్డి అనే వ్యక్తి పొలంలో శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న తూప్రాన్ ఎస్సై శివానందం తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. ఈ దాడిలో బిక్షపతి, బొల్లా బోయిన నర్సింలు, అంబాపురం రాజు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఓ కంప్రెసర్ ట్రాక్టర్, కొంత పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, "అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను కలిగి ఉండటం లేదా ఉపయోగించటం చట్టపరంగా నేరం. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఎస్సై శివానందం హెచ్చరించారు.
Post a Comment