భద్రాచలం: లాడ్జిలో సీక్రెట్ కెమెరాలు… ప్రేమ జంటకు బ్లాక్‌మెయిల్ షాక్!
భద్రాచలం పట్టణంలో ఓ లాడ్జి సిబ్బంది ప్రేమ జంటను టార్గెట్ చేస్తూ సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీ రాఘవ రామ రెసిడెన్సీలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం, ఇటీవల ఓ ప్రేమజంట వ్యక్తిగత సమయం గడిపేందుకు భద్రాచలంలోని రఘురామ రెసిడెన్సీకి వచ్చారు. వారు గదిలో గడుపుతున్న ఏకాంత సమయాన్ని సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియో తీసిన సిబ్బంది, అనంతరం ఆ వీడియోలను చూపించి డబ్బులు డిమాండ్ చేశారు.
బంగారం అమ్మి డబ్బులు… అయినా వేధింపులు ఆగలేదట!
ఆ ప్రేమికులపై మొదట లక్ష రూపాయల డిమాండ్ చేయడంతో యువకుడు ఆందోళనకు గురయ్యాడు. అనంతరం ప్రేయసి తన బంగారాన్ని అమ్మి డబ్బులు సమర్పించిందని సమాచారం. అయితే సిబ్బంది ఆశలు అక్కడితో ఆగలేదు. మళ్లీ మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తూ, వీడియోలు ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు.
వేధింపులు తాళలేక చివరికి ప్రేమ జంట భద్రాచలం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో లాడ్జిలో అనుమానాస్పదంగా అమర్చిన కెమెరాలు గుర్తించగా, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి లాడ్జి సిబ్బందిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ప్రైవసీ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీస్తాం: పోలీసులు
ఈ సంఘటన ప్రైవసీ హక్కుల ఉల్లంఘనకు పరాకాష్ఠగా నిలుస్తోంది. బాధితుల గౌరవాన్ని రక్షించేందుకు పోలీసులు వేగవంతంగా స్పందించారని సమాచారం. తగిన ఆధారాల ఆధారంగా లాడ్జి యాజమాన్యంపై పక్కాగా కేసులు నమోదు చేసి, బలమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment