-->

మంచిర్యాలలో హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి

మంచిర్యాలలో హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి


మంచిర్యాల, మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కాలేజీ హాస్టల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి పడిన ఇంటర్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న సహస్ర (17)గా పోలీసులు గుర్తించారు.

విషాదకర ఘటన మూడవ అంతస్తులో చోటుచేసుకుందని, రాత్రి భోజనానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. అయితే ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

పరిస్థితి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకొని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

Blogger ఆధారితం.