ముదిరాజ్ మహిళల చైతన్యంతోనే రాజ్యాధికారం సాధ్యం : డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్
ఎల్లారెడ్డి, ముదిరాజ్ మహిళల రాజకీయ చైతన్యమే రానున్న రోజుల్లో జాతికి రాజ్యాధికారాన్ని సాధించేందుకు మార్గం అవుతుందని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన "ముదిరాజ్ మహాసభ మహిళా శక్తి సంఘం" సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ముదిరాజ్ మహిళలు రాజకీయ చైతన్యం గలవారిగా ఎదిగితేనే రాజ్యాధికారంలో తమకు గుణాత్మక స్థానం లభిస్తుందన్నారు. జాతి చరిత్రలో మహిళల పాత్రను ఉదహరిస్తూ, వారు పోరాటాలలో ప్రథమ పాత్రధారులుగా నిలిచిన సందర్భాలను వివరించారు.
మహిళల ఆర్థిక, విద్యా, రాజకీయ హక్కులపై అవగాహన పెంచేందుకు ముదిరాజ్ మహాసభ గ్రామ స్థాయిలో మహిళా శక్తి సంఘాలను ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. ఓటు హక్కు విలువను, ఉపాధి అవకాశాలపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా సంస్థ కృషి చేస్తోందని వివరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో జాతికి చెందిన నేతలనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావాలని, గ్రామ స్థాయి నుంచే జిల్లా స్థాయిలోనూ నేతలుగా ఎదగాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు, మండల అధ్యక్షురాలు జ్యోతి ముదిరాజ్, గ్రామాధ్యక్షురాలు పోచవ్వ ముదిరాజ్, స్వప్న, రామక్క, బాలమణి, హరిత, కీర్తన ముదిరాజ్, ఎలారెడ్డి మండల అధ్యక్షులు ప్యాలల రాములు ముదిరాజ్, నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు బాలయ్య ముదిరాజ్, జిల్లా నాయకులు సంతోష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment