వికారాబాద్ వన మహోత్సవంలో పాల్గొన్న డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క్
వికారాబాద్ జిల్లా యాలల్ మండలం జుంటుపల్లిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి, వృక్షార్చన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే అందరూ భాగస్వాములై వృక్షాలు నాటి వాటిని సంరక్షించాలి," అని అన్నారు. అనంతరం ఆయన గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యాని మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నేతలు పిలుపునిచ్చారు.
Post a Comment