-->

జనగామ జిల్లా యువకుడు అమెరికా జైల్లో ఆత్మహత్య

జనగామ జిల్లా యువకుడు అమెరికా జైల్లో ఆత్మహత్య


జనగామ అమెరికాలో లైంగిక వేధింపుల కేసులో 35 ఏళ్ల జైలు శిక్ష విధించబడిన జనగామ జిల్లా వాసి జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) ఓక్లహోమా రాష్ట్రం ఎడ్మండ్ పట్టణంలో నివాసముండేవాడు. 2023లో ఎఫ్బీఐ అతని సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి, 13-15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ మైనర్లను మోసగించినట్టు గుర్తించింది. అసభ్య చిత్రాలు పంపించడం, మైనర్లను బెదిరించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దర్యాప్తులో మొత్తం 19 మంది మైనర్లను అతడు వేధించినట్టు తేలింది.

తదనంతరం కోర్టు అతనికి 35 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం జూలై 26న సాయికుమార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు జూలై 31న అమెరికాకు వెళ్లారు. ఈ ఘటన వల్ల నెల్లుట్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.