-->

దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ.. మహిళ ఆత్మహత్య

దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ.. మహిళ ఆత్మహత్య


హైదరాబాద్, "దేవుడి దగ్గరికి వెళ్తున్నా.. ఆత్మార్పణతో ఆయనకు దగ్గరవుతా" అంటూ ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ఈ విషాద సంఘటన హిమాయత్‌నగర్‌లో శనివారం ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, హిమాయత్‌నగర్‌కు చెందిన అరుణ్‌కుమార్ జైన్, పూజా జైన్ (వయస్సు 43) దంపతులు. కొద్ది కాలంగా పూజా జైన్ ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపుతూ ఆ మార్గంలో మమేకమవుతున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లిన తరువాత, ఆమె నివాసముంటున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ దుర్ఘటన స్థలంలో పోలీసులు ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె "ఆత్మార్పణతోనే దేవుడికి దగ్గరవుతాను" అని పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.