మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడిన కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం జరిగిన ప్రభుత్వ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆహార పంపిణీ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిను తాము పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే, గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి స్థానిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు మంత్రి వివేక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని మంత్రితోపాటు వేదికపైకి ఆహ్వానించకపోవడాన్ని ఆయన అనుచరులు గట్టిగా అభ్యంతరపట్టారు.
"పార్టీని నమ్మి పని చేస్తున్నామే తప్ప... ఇలాంటి అవమానాలకు తావుండదంటూ" నర్సారెడ్డి వర్గీయులు హౌరా చేసారు. బహిరంగ సభలోనే మంత్రి వివేక్ వారికి సర్ది చెప్పే యత్నం చేశారు. "ఏవైనా అభ్యంతరాలుంటే బయట మాట్లాడుకుందాం, ప్రజా కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదు" అని కోరినా వారు వినిపించుకోలేదు.
ఈ పరిణామంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి స్థానిక నాయకుల జోక్యంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. కార్యక్రమం అనంతరం పలువురు పార్టీ శ్రేణులు ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆంతర్యాల్లో ఆమోదం లేకుండానే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ సంక్షోభాలకు దారి తీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Post a Comment