సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.150 కోట్లు మంజూరు
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుపొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మహా జాతర కోసం ఏర్పాట్లు జోరుగా కొనసాగనున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో నిధులు కేటాయించడం విశేషమని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ప్రాధాన్యతనిస్తూ జాతర ఏర్పాట్లకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల ఆత్మీయ పండుగగా భావించే మేడారం జాతరను మరింత భవ్యంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు.
మూడ్రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాదిమంది భక్తులు, యాత్రికులు తరలివస్తారు. రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Post a Comment