నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత ఈ సుందర దృశ్యాలు భారీగా తరలివస్తున్న ప్రజలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరదనీరు పెద్దఎత్తున నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చేరుతోంది. ఇప్పటికే సాగర్ జలాశయంలో నీటిమట్టం 585.90 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వరద ఒత్తిడిని నియంత్రించేందుకు ప్రాజెక్టు 26 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లోకి 2,52,341 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఔట్‌ఫ్లో 2,45,894 క్యూసెక్కులుగా నమోదైంది.
వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు కింద ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు నదికి దగ్గరగా వెళ్లరాదని, అవసరమైతే తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రాజెక్టు వద్ద వరద సుందర దృశ్యాలు కనిపించడంతో పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమయ్యారు.

Post a Comment