ఇమామ్ మౌజన్‌లకు గౌరవ వేతనాల కోసం ఆగస్టు 31 వరకు గడువు
🔹 పూజారులకు లేని నిబంధనలు ఇమామ్ మౌజన్‌లకు ఎందుకు?
🔹 రోజుకు రూ.166 ఇవ్వడానికి ఆరు పత్రాలా?
🔹 కనీస గౌరవ వేతనం రూ.10,000 ఇవ్వాలి
🔹 – ఎండి షబ్బీర్
తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘ స్థాపకులు ఎండి షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాల కోసం వివిధ రకాల పత్రాలు సమర్పించాలన్న నిబంధనను విధించడం విచిత్రమని పేర్కొన్నారు. పూజారులకు ఇలాంటి నిబంధనలు లేనప్పుడు, పేద ముస్లిం సేవకులకు మాత్రమే ఇవి ఎందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
వక్ఫ్ బోర్డు కోరుతున్న ఆరు రకాల పత్రాలు ఇవే:
- ఆధార్ కార్డు
- ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా
- రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- మస్జిద్ నిర్వహణ కమిటీ లెటర్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- పాన్ కార్డు
ఈ పత్రాలు అందించేందుకు మొదట ఇచ్చిన గడువు ముగియడంతో తాజాగా ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారని తెలిపారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ సమాచారం లభించలేదని, పత్రాలు సమర్పించలేని వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో నివసించే బీసీ (ఈ) లోపల క్రమ సంఖ్య 12లో ఉన్న షేక్ ముస్లింలే అధికంగా ఇమామ్‌లుగా, మౌజన్‌లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ బీసీ (ఈ) వర్గంలో 14 రకాల వృత్తులుండగా, దర్గాల సంరక్షణ, మస్జిద్‌ల నిర్వహణలో కూడా షేక్ ముస్లింల పాత్ర ఉందని వివరించారు.
ప్రస్తుతం అద్దె ఇండ్లకే నెలకు రూ.5,000 – రూ.6,000 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో నెలకు రూ.5,000 కూడా అందకుండా ఉండటం బాధాకరమని అన్నారు.
కనీస వేతనం రూ.10,000 ఇవ్వాలని
ఇమామ్‌లు, మౌజన్‌లు గౌరవంగా జీవించేందుకు కనీస వేతనం రూ.10,000 ఇవ్వాలని, రాష్ట్రంలోని అన్ని మస్జిద్‌లకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఎండి షబ్బీర్ కోరారు.
Post a Comment