-->

భర్తను మద్యం తాగించి, గడ్డిమందు పోసి హత్య చేసిన భార్య..!

భర్తను మద్యం తాగించి, గడ్డిమందు పోసి హత్య చేసిన భార్య..!


కరీంనగర్‌ : తనపై అనుమానం పెంచుకుంటూ, రోజూ తాగొచ్చి వేధిస్తున్నాడన్న కోపంతో ఓ భార్య తాను ప్రేమించుకున్న వ్యక్తితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన కరీంనగర్‌లో సంచలనంగా మారింది. జూలై 29న జరిగిన ఈ హత్య కేసును మంగళవారం కరీంనగర్‌ పోలీసులు ఛేదించారు.

సీపీ గౌస్‌ ఆలం వివరాలు వెల్లడిస్తూ తెలిపిన మేరకు – కరీంనగర్‌ సుభాష్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్‌ (వయసు 45) జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. జూలై 29న అతడి మృతదేహం బొమ్మకల్‌ వద్ద రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదంగా పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరణలో కీలకంగా నిలిచింది అతని భార్య రమాదేవి విచారణ. ఆమె కిసాన్‌నగర్‌కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా, సంపత్‌ తరచూ తాగొచ్చి ఆమెను వేధించేవాడట. దీంతో భర్తను తొలగించాలని నిశ్చయించుకున్న రమాదేవి, రాజయ్యతోపాటు ఖాదర్‌గూడేనికి చెందిన ఆమె బంధువు కీసరి శ్రీనివాస్‌తో కలిసి హత్య ప్రణాళిక వేసింది.

ప్రణాళిక ప్రకారం జూలై 29న ముగ్గురు కలిసి సంపత్‌ను బొమ్మకల్‌ ఫ్లై ఓవర్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో రాజయ్య, శ్రీనివాస్‌లు కలిసి అతని చెవిలో గడ్డి మందు పోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రైల్వేట్రాక్‌ వద్ద పడేసి వెళ్లిపోయారు.

రూరల్‌ పోలీసులు విచారణలో మూడుమందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు నరేశ్, లక్ష్మారెడ్డిని సీపీ గౌస్‌ ఆలం అభినందించారు.

Blogger ఆధారితం.