-->

రౌడీషీటర్ మహబూబ్‌ను కత్తితో నరికి చంపిన దుండగులు

రౌడీషీటర్ మహబూబ్‌ను కత్తితో నరికి చంపిన దుండగులు


హైదరాబాద్, నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో హృదయాన్ని కలిచివేసే హత్య ఘటన చోటుచేసుకుంది. పటపగలే ఓ రౌడీషీటర్‌ను కత్తులతో దుండగులు చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతుడిని ముషీరాబాద్‌కు చెందిన **ఎం.డి. మహబూబ్ (35)**గా పోలీసులు గుర్తించారు. ఆయనపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉండగా, 13 క్రిమినల్ కేసులు, ముఖ్యంగా దొంగతనాలు, హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.

హత్య ఘటన వివరాల ప్రకారం –
మహబూబ్ ఎల్లమ్మబండలో గల గుడ్ విల్ హోటల్‌ వద్ద చాయ్ తాగుతుండగా, ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి అతనిపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. కొబ్బరి బొండాలు నరికే పెద్ద కత్తులతో ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

స్థానికుల సమాచారం మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ స్పందిస్తూ – నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. హత్యకు గల మోటివ్‌ను తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. దుండగుల అరెస్టు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

Blogger ఆధారితం.