జూనియర్ అసిస్టెంట్ 15,000/- లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన కె. సుజాత
వికారాబాద్: ఫిర్యాదుదారుని తల్లికి ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమిలో ఆమె పేరును చేర్చడానికి సంబంధించి, అవసరమైన పత్రాలను ప్రాసెస్ చేయడం మరియు కలెక్టర్ జారీ చేసిన అధికారిక సందేశ ప్రతిని నవాబ్‌పేట తహశీల్దార్ కార్యాలయానికి పంపే ప్రక్రియలో, రూ.15,000/- లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ కె. సుజాత పట్టుబడ్డారు.
ఈ ఘటన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. లంచం తీసుకునే క్రమంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
తెలంగాణ ACB ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి డయల్ చేయాలని, అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ACB స్పష్టం చేసింది.

Post a Comment