తిరుమలకు వెళ్తున్నారా? ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే ఎంట్రీ లేదు!
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. సంక్రాంతి, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి సందర్భాల్లో రద్దీని నియంత్రించడం టీటీడీకి సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 15 నుంచి తిరుమలకు వెళ్ళే అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ఎవరినీ కొండపైకి అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.
ఫాస్ట్ ట్యాగ్ లేని భక్తుల కోసం అలిపిరి వద్ద ఐసీఐసీఐ బ్యాంకు ఫాస్ట్ ట్యాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేస్తారు. అక్కడే తక్షణమే ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేసి ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంటుంది.
టీటీడీ ఆశలు —
- రద్దీ నియంత్రణ
- వేగవంతమైన వాహన తనిఖీ
- భద్రతా ప్రమాణాల పెంపు
ఈ కొత్త విధానం వల్ల రద్దీ నియంత్రణలో ఎంత ఫలితం వస్తుందో చూడాలి.
Post a Comment