హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, అశ్వారావుపేట మండలం తుమ్మలకుంటకు చెందిన షేక్ నసీర్ @ నజీర్ @ థంగ్లికి హత్య కేసులో జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధించారు.
2022 డిసెంబర్ 8న ఆర్.ఎం.పీ. డాక్టర్ లింగాల చక్రధరరావు వైద్య సేవల కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు వినాయకపురం వద్ద పొలంలో ఆయన మృతదేహం లభ్యమైంది. కుడి భుజం వద్ద పదునైన ఆయుధంతో నరికి హత్య చేసిన గుర్తులు ఉండటంతో కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అనంతరం పోలీసులు నసీర్‌ను నిందితుడిగా గుర్తించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 22 మంది సాక్షుల వాంగ్మూలం, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నేరం రుజువై శిక్ష విధించారు.
ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదనలు వినిపించారు. దర్యాప్తులో అశ్వారావుపేట పోలీసులు, కోర్టు సిబ్బంది సహకరించారు.
Post a Comment