-->

కూతురిపై అత్యాచారం… తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష

కూతురిపై అత్యాచారం… తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష


నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన ఘోరమైన అత్యాచార ఘటనలో తల్లికే 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కేసు వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి — నల్గొండకు చెందిన యాదమ్మ గ్యారాల శివకుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే శివకుమార్, యాదమ్మ సహకారంతో ఆమె మైనర్ కూతురిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణంపై 2023లో నల్గొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

విచారణ అనంతరం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. రెండో నిందితురాలైన యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఈ తీర్పు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Blogger ఆధారితం.