-->

అక్కా-తమ్ముడి బంధాన్ని మరిచి వివాహం.. కర్ణాటకలో కలకలం

అక్కా-తమ్ముడి బంధాన్ని మరిచి వివాహం.. కర్ణాటకలో కలకలం


Bengaluru : రక్త సంబంధాన్ని పక్కనపెట్టి పిన్నమ్మ కూతురిని పెద్దమ్మ కొడుకు వివాహం చేసుకున్న ఘటన Chikkaballapur జిల్లాలో సంచలనంగా మారింది. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

సమాచారం ప్రకారం, బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి సమీపంలోని సావకనహళ్లికి చెందిన శశికళ, హొసకోటకు చెందిన ప్రవీణ్ తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. కుటుంబ బంధాల ప్రకారం వీరు అక్కా-తమ్ముడు వరుసలోకి వస్తారు. శశికళ వయసులో ప్రవీణ్ కంటే కొంత పెద్దది.

అయితే గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, శశికళ తల్లిదండ్రులు ఆమెకు మరో సంబంధం చూసి వివాహం కూడా ఖరారు చేశారు. పెళ్లి పత్రికలు పంపిణీ చేస్తున్న సమయంలోనే శశికళ తన బంధువు ప్రవీణ్‌తో కలిసి అంగట్ట గ్రామంలోని ఈశ్వర ఆలయంలో వివాహం చేసుకుంది.

వివాహం అనంతరం తమ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ ఈ జంట Chikkaballapur ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793