నేటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు
తెలంగాణ హైకోర్టు కు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. జూన్ 8 వరకు కోర్టు సాధారణ విచారణలు నిలిపివేయబడనున్నాయి. అయితే అత్యవసర కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా వెకేషన్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు.
సెలవుల సమయంలో అత్యవసర పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు మే 12, 19, 26 మరియు జూన్ 2 తేదీల్లో అవకాశం కల్పించారు. అలాగే మే 14, 21, 28 మరియు జూన్ 4 తేదీల్లో వెకేషన్ బెంచ్‌లు విచారణలు నిర్వహించనున్నాయి.
ఈ ప్రత్యేక బెంచ్‌లలో ఒక డివిజన్ బెంచ్, ఒక సింగిల్ బెంచ్ విధులు నిర్వర్తించనున్నాయి. హెబియస్ కార్పస్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ దరఖాస్తులు, ఇతర అత్యవసర అంశాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

Post a Comment