చూపులేని శిశువు జననానికి రూ. కోటి పరిహారం
తెలంగాణలో వైద్య నిర్లక్ష్యానికి సంబంధించిన కీలక ఘటనలో వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. Adilabad జిల్లాకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ గర్భధారణ సమయంలో పలుమార్లు స్కానింగ్ పరీక్షలు చేయించుకోగా, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నివేదికలు ఇచ్చారు.
అయితే ప్రసవం అనంతరం శిశువు రెండు కళ్లు లేకుండా జన్మించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. స్కానింగ్ సమయంలోనే లోపాలను గుర్తించాల్సి ఉండగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు Jabez Shamyuel వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బాధితురాలికి రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, అదనంగా కోర్టు ఖర్చుల కింద రూ.34 వేలును చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ తీర్పు వైద్య రంగంలో స్కానింగ్ పరీక్షల ఖచ్చితత్వం, బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.

Post a Comment