కాంగ్రెస్ పార్టీలో పదవుల సందడి: 18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
హైదరాబాద్, మే 06 (వెబ్‌డెస్క్): తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మొత్తం 18 కార్పొరేషన్‌లు/ఫెడరేషన్లకు చైర్మన్లు, 11 మందికి వైస్ చైర్మన్ పదవులు కేటాయిస్తూ జాబితా విడుదలైంది. ఈ నియామకాలు పార్టీ అంతర్గత సమతుల్యతతో పాటు వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా చేపట్టిన కీలక చర్యగా భావిస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం నియామకాలు ఇలా ఉన్నాయి:
- బ్రాహ్మణ సంక్షేమ పరిషత్
చైర్మన్: బస్వరాజు శ్రీనివాస్
వైస్ చైర్మన్: పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్
- రజక సహకార సంస్థ లిమిటెడ్
చైర్మన్: డా. దాసరిరాజు అజయ్ కుమార్
వైస్ చైర్మన్: బంగారు బాబు
- గౌడ సహకార సంస్థ కార్పొరేషన్
చైర్మన్: మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్
వైస్ చైర్మన్: కేసం నాగరాజు గౌడ్
- పెరిక కార్పొరేషన్
చైర్మన్: దొంగరి వెంకటేశ్వర్లు
వైస్ చైర్మన్: బుడగం శ్రీనివాస్
- మేర కార్పొరేషన్
చైర్మన్: సంగ వెంకటరాజం
వైస్ చైర్మన్: ఎం. లక్ష్మీ నారాయణ
- వాల్మీకి బోయ కార్పొరేషన్
చైర్మన్: గట్టు తిమ్మప్ప
వైస్ చైర్మన్: బోయ నాగేష్
- మున్నూరుకాపు కార్పొరేషన్
చైర్మన్: బొమ్మ శ్రీరామ్
వైస్ చైర్మన్: అల్లం భాస్కర్
- యాదవ కార్పొరేషన్
చైర్మన్: ఎం. రఘునాథ్ యాదవ్
వైస్ చైర్మన్: గజ్జి భాస్కర్ యాదవ్
- వడ్డెర కార్పొరేషన్
చైర్మన్: గుంజా రేణుక నారాయణ
వైస్ చైర్మన్: బత్తుల వెంకటేష్
- తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ
చైర్మన్: దూడెం వెంకట్ రమణ
వైస్ చైర్మన్: జక్కని అనిత
- కమ్మ కార్పొరేషన్
చైర్మన్: బండి రమేష్
వైస్ చైర్మన్: పరుచూరి మురళి
- పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్
చైర్మన్: గూడూరు శ్రీనివాస్
- భట్టరాజ కోఆపరేటివ్ ఫెడరేషన్
చైర్మన్: సీహెచ్. బాల్‌రాజు
- వెలమ కార్పొరేషన్
చైర్మన్: జువ్వాడి నర్సింగ్ రావు
- గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్
చైర్‌పర్సన్: కొల్లె సరిత
- లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ
చైర్మన్: చరణ్ కౌశిక్ యాదవ్
- తెలుగు అకాడెమీ
చైర్మన్: ప్రొ. వెంకటనారాయణ
- తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్
చైర్మన్: సూదిని రామిరెడ్డి
సభ్యులు: కృష్ణ కుమార్ నాగులూరి, బూస వేణుగోపాల్ యాదవ్
ఈ నియామకాలతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే కాకుండా, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పునాది వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment