పిడుగుల ముప్పు.. తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్..!
హైదరాబాద్, మే 06: తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) సమాచారం మేరకు, రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలకు తోడు పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించారు.
అలాగే మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఓపెన్ ప్రదేశాల వద్ద నిలవకూడదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment