7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన బోధన్‌లో ఎస్ఐ
నిజామాబాద్ జిల్లా, మే 6: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ చిట్టానోజు భాస్కర్ చారిను లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భాస్కర్ చారి ఒక వ్యక్తి నుంచి పని చేయడానికి రూ.7,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో వారు ఉచ్చుపన్ని, ప్లాన్ ప్రకారం పోలీస్ స్టేషన్‌లోనే దాడి నిర్వహించారు.
బాధితుడి నుంచి రూ.7,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్ఐను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద లభ్యమైన నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో పోలీస్ విభాగంలో కలకలం రేగింది. అవినీతి కార్యకలాపాలపై ఎవరైనా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.
ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశముంది.

Post a Comment