-->

రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం: నాగా సీతారాములు

రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం: నాగా సీతారాములు


సుజాతనగర్, మే 6: ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల సందర్భంగా సుజాతనగర్ రైతు వేదికలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు తీసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అలాగే పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం కోసం ప్రభుత్వం అందిస్తున్న రుణాలను వినియోగించుకోవాలని కోరారు. రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు రైతులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలపై వివరాలు అందిస్తూ, ప్రస్తుత మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం, అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి నర్మద, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, సొసైటీ డైరెక్టర్లు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ఆదర్శ రైతులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793