-->

మే 16న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం టీవీకేకు మద్దతు సమీకరణ వేగం

మే 16న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం టీవీకేకు మద్దతు సమీకరణ వేగం


తమిళనాడు, మే 5: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 10 స్థానాలు దూరంలో ఉంది.

అధికారాన్ని దక్కించుకునేందుకు టీవీకే మద్దతు సమీకరణపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో విజయ్ జరిపిన చర్చలు కీలకంగా మారాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు లభించిన 5 సీట్లు ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి సానుకూల సంకేతాలు రావడం టీవీకేకు ఊతమిచ్చే అంశంగా మారింది.

ఇక పట్టాలి మక్కల్ కచ్చి (PMK), విడுதలై చిరుతైగళ్ కచ్చి (VCK), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) వంటి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ పార్టీల మద్దతు లభిస్తే విజయ్‌కు అవసరమైన మెజారిటీ సాధించడం సులభమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా గవర్నర్‌ను కలవడం, మద్దతు లేఖలు సమర్పించడం వంటి చర్యలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అన్ని రాజకీయ సమీకరణలు అనుకూలిస్తే మే 16న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మద్దతు స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793