రంగారెడ్డి జిల్లాలో మూడు 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట, మొయినాబాద్, బాకారం మండలాల్లో కొత్తగా మూడు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
- నవాబ్‌పేట మండలంలోని నారెగూడ గ్రామంలో ₹2.40 కోట్ల అంచనా వ్యయంతో,
- మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ₹8 కోట్ల అంచనా వ్యయంతో,
- బాకారం – నాగిరెడ్డిగూడెం గ్రామాల్లో ₹10 కోట్ల అంచనా వ్యయంతో
ఈ సబ్‌స్టేషన్లు త్వరలో నిర్మించబడనున్నాయి.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “రైతులకు స్థిరమైన విద్యుత్ సరఫరా అందించడం, గ్రామాల అభివృద్ధి సాధించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.
తరువాత ఆయన నూతన రేషన్ కార్డులు, రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేసి, స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
Post a Comment