టెన్త్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం, పాత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అంటే, ఫైనల్ పరీక్షల్లో 80% మార్కులు, ఇంటర్నల్ పరీక్షల్లో 20% మార్కులు కొనసాగుతాయి.
గతంలో ప్రభుత్వం ఇంటర్నల్ మార్కులు తీసివేయాలనే ఆలోచన చేసినప్పటికీ, పునరాలోచన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ ఏడాది కూడా ఇంటర్నల్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది.
విద్యాశాఖ అభిప్రాయం ప్రకారం, పరీక్షల విధానంపై ముందుగానే స్పష్టత ఇవ్వడం ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండవచ్చని తెలిపింది. ఈ మేరకు పాత విధానాన్నే కొనసాగించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..

Post a Comment