-->

వేతనాల తగ్గింపుపై మార్షల్స్‌ సామూహిక రాజీనామా

ప్రభుత్వ హామీతో తిరిగి విధుల్లో చేరిక


హైదరాబాద్‌: హైడ్రా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మాజీ ఆర్మీ, సీఐఎ్‌సఎఫ్‌ ఉద్యోగులు (మార్షల్స్‌) జీతాల తగ్గింపుకు నిరసనగా సోమవారం సామూహికంగా రాజీనామా చేశారు. నెలసరి వేతనం ₹29,250 నుంచి ₹22,750కు తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నెక్లెస్ రోడ్ పీవీ మార్గ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యాలయం నుండి బుద్ధభవన్‌లో గల హైడ్రా కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీగా వచ్చి హైడ్రా కమిషనర్‌కు రాజీనామాలు సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీతాల తగ్గింపు అన్యాయమని, తమ కుటుంబాల జీవనాధారం కష్టాల్లో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న రంగనాథ్‌ మార్షల్స్‌ను పిలిపించి మాట్లాడారు. పాత వేతనమే ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. దీంతో వెంటనే మార్షల్స్‌ విధుల్లో హాజరయ్యారు.

సమాచారం ప్రకారం, భవిష్యత్తులో మార్షల్స్‌కు ₹23,000 హైడ్రా నుండి, మిగతా ₹6,000 GHMC నుండి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Blogger ఆధారితం.