-->

ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి బాలుడి మృతి

 

ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి బాలుడి మృతి

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగత్రావుపేట గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల కోసం త్రవ్విన పిల్లర్ గుంతలో వాంకుడోత్ చక్రి (7) అనే చిన్నారి ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడు.

కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆ బాలుడు గుంతలో ప్రాణాలు కోల్పోయాడు. బయటకు తీసే ప్రయత్నం చేసినా అప్పటికే చక్రి మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇలాంటి నిర్మాణ పనుల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793