-->

పెళ్లి పేరుతో మోసం – యువతి ఆత్మహత్య

పెళ్లి పేరుతో మోసం – యువతి ఆత్మహత్య


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్యతండాకు చెందిన తుళ్లిక శ్రీ (23) పెళ్లి పేరుతో మోసపోయి ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురానికి చెందిన బానోతు బిచ్చాతో పెద్దలు పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం చేస్తూ లక్షకు పైగా జీతం వస్తుందని చెప్పడంతో తుళ్లిక శ్రీ తల్లిదండ్రులు కట్నం కింద 60 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు.

మూడు నెలలుగా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, శారీరకంగా దగ్గరయ్యారు. అయితే ఇటీవల బిచ్చా అనుమానాలు పెంచి, వేరే అబ్బాయి మెసేజ్ పెడితే సంబంధం అంటగట్టి దారుణంగా కొట్టాడు. "ఇక పెళ్లి చేసుకోను, చస్తే చావు" అంటూ మెసేజ్ పెట్టాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన తుళ్లిక శ్రీ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో మూడు రోజుల చికిత్స పొందినా మృతి చెందింది.

తుళ్లిక శ్రీ బంధువులు మాట్లాడుతూ బిచ్చా ఇంతకుముందు కూడా మరో ముగ్గురు యువతులను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ఫిర్యాదు ఆధారంగా టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న బిచ్చా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793