-->

బర్త్ సర్టిఫికెట్ కోసం లంచం 25 వేలు తీసుకుంటూ ఏసీబీ వలలో ఆర్డీవో

 

బర్త్ సర్టిఫికెట్ కోసం లంచం 25 వేలు తీసుకుంటూ ఏసీబీ వలలో ఆర్డీవో

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో అవినీతి ఘటన వెలుగుచూసింది. బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఆర్డీవో రామచందర్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.

సమాచారం ప్రకారం, ఒక వ్యక్తి నుంచి రూ.25 వేల లంచం కోరిన ఆర్డీవోపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా ట్రాప్ ఏర్పాటు చేశారు.

ఆర్డీవో కార్యాలయంలోనే రామచందర్ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793