-->

ఆర్టీసీ బస్సులో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

ఆర్టీసీ బస్సులో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణ పథకంలో వింత సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ–జగ్గయ్యపేట ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘర్షణ ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రయాణం మొదలవగానే ఒకే సీటు కోసం ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగారు. మాటల తూటాలు కాస్తా చేతుల దెబ్బలకు దారితీశాయి. ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని తీవ్రంగా కొట్టుకున్నారు. తోటి మహిళా ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా వారిని ఆపడం సాధ్యం కాలేదు.

బస్సులో ఉన్న ఇతరులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. చివరికి డ్రైవర్, కండక్టర్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793