-->

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన మోటార్ వాహన ఇన్స్పెక్టరు

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన మోటార్ వాహన ఇన్స్పెక్టరు


ఆర్మూర్‌ (నిజామాబాద్): మోటారు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ల పునరుద్ధరణ, లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ మొదలైన సేవలకు సంబంధించి ఫిర్యాదుదారుని నుండి రూ.25,000/- లంచం తీసుకుంటూ ఆర్మూర్‌ మోటారు వాహన ఇన్స్పెక్టరు గుర్రం వివేకానంద రెడ్డి మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ తిరుపతి గురువారం తెలంగాణ రాష్ట్ర అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

ఫిర్యాదుదారునికి తక్షణ సేవలందించి, భవిష్యత్తులో కూడా ఎలాంటి దస్తావేజులు పెండింగ్‌లో ఉంచబోమని నమ్మబలికే క్రమంలో లంచం స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తూ ACB అధికారులు తెలిపారు: “ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయండి. అదేవిధంగా WhatsApp (9440446106), Facebook (Telangana ACB), Twitter/X (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి” అని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793