-->

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం: నాగా సీతారాములు

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం: నాగా సీతారాములు


సుజాతనగర్: సుజాతనగర్ మండలం సింగభూపాలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరై గృహప్రవేశాన్ని నిర్వహించారు.

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు చీలం బసవమ్మ-శ్రీను మరియు చెవుల కృష్ణవేణి-శ్రీను దంపతులు తమ సొంత ఇంటిలోకి అడుగుపెట్టగా, వారికి నూతన వస్త్రాలు బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవిన్యూ & గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గృహ కల సాకారం అవుతోందని, రాబోయే రోజుల్లో మరింత మంది అర్హులైన కుటుంబాలకు ఇళ్లు మంజూరు అవుతాయని అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి నివాసం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిన్నెర వెంకన్న, కొత్తగూడెం కార్పొరేషన్ 45వ డివిజన్ కార్పొరేటర్ దంతెబోయిన నరేష్, ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాసబంటి బాబు, నలగొర్ల మల్లయ్య, కట్టెబోయిన శివ, రాచబంటి నాగరాజు, ఉగ్గం నాగేశ్వరరావు, మంచినీళ్ల గణేష్, పరిటాల అశోక్, పెరుగు రాజు తదితరులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793