-->

ప్రియురాలి కోసం భార్యను హతమార్చిన క్రూర భర్త!

ప్రియురాలి కోసం భార్యను హతమార్చిన క్రూర భర్త!


మహబూబాబాద్ జిల్లా, ఆగస్టు 30: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలితో కలిసి జీవించాలనే కోరికతో భార్యను క్రూరంగా హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిపేడు మండలం బాల్యతండాకు చెందిన గణేష్, సూర్యాపేట జిల్లా దక్షిణపల్లి గ్రామానికి చెందిన గౌతమీతో ఈ ఏడాది మే 18న వివాహం జరిగింది. కోరిన కట్నం, కానుకలతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగినప్పటికీ, పెళ్లి మూడు నెలలకే గౌతమీ ప్రాణాలు కోల్పోవడం విషాదం.

వివాహం కంటే ముందే తన క్లాస్‌మేట్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న గణేష్, వరంగల్‌లో ఆటో డ్రైవింగ్ చేస్తూ మంచి సంపాదన వస్తుందని కుటుంబ సభ్యులను నమ్మించి అక్కడే కాపురం పెట్టాడు. ఆదాయం పెరగడంతో ఆటోను కూడా కొనుగోలు చేశాడు. అయితే, తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో భార్యను వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు.

ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గౌతమీపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం భార్య శ్వాస ఆడడం లేదని నటన చేస్తూ 108కి కాల్‌ చేశాడు. కానీ, పోలీసులు విచారణ జరపగా చివరికి తానే హత్య చేసినట్లు గణేష్ ఒప్పుకున్నాడు.

ఈ సంఘటనతో బాల్యతండా ప్రాంతంలో కలకలం రేగింది. కేవలం మూడు నెలల వివాహ బంధాన్ని చంపేసిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793