-->

పొట్టు పొట్టు కొట్టుకున్న డ్వాక్రా మహిళలు వాయిదాల డబ్బుల వివాదం…

 

పొట్టు పొట్టు కొట్టుకున్న డ్వాక్రా మహిళలు వాయిదాల డబ్బుల వివాదం…

జోగిపేట (అందోల్‌): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదనే వివాదంతో డ్వాక్రా సంఘం మహిళలు పరస్పరం దాడి చేసుకున్న ఘటన జోగిపేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… జోగిపేటకు చెందిన లక్ష్మీనర్సింహ డ్వాక్రా గ్రూప్ మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేరిట రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మల్లీశ్వరి తీసుకున్న రుణాన్ని ఆమె అత్త వెంకమ్మకు ఇచ్చింది. అయితే వెంకమ్మ ఆ డబ్బును ఉపయోగించుకుని వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్ చేసి చెల్లింపుల గురించి సమాచారం ఇచ్చారు.

దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి ఇరువర్గాలు కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వెంకమ్మకు గాయాలయ్యాయి.

స్థానికులు డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, మల్లీశ్వరి మరియు అనిత మాత్రమే ఆ డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793